తెలంగాణలో కరోనా కేసులు పెరగడంతో ప్రభుత్వం సంక్రాంతి సెలవులను 30వ తేదీ వరకూ పొడిగించిన సంగతి తెలిసిందే. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకుంది. అయితే విద్యార్థులు భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని గత సోమవారం నుంచి 8, 9, 10 తరగతులకు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించాలని ఆదేశించింది. అయితే మరో ఐదు రోజుల్లో సెలవులు ముగియడంతో సోమవారం నుంచి స్కూళ్లను తిరిగి తెరిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. విద్యార్ధులు ఆన్ లైన్ క్లాసుల…