Vijayasai Reddy Fires On Chandrababu Naidu For Burning GO No1: సంక్రాంతి పండుగ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు తన స్వగ్రామం నారావారిపల్లెలో జీవో నం.1 ప్రతులను భోగిమంటల్లో తగలబెట్టిన విషయం అందరికీ తెలిసిందే! ఈ వ్యవహారంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్ మాధ్యమంగా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈరోజు జీవోని తగలబెట్టాడని, రేపు రాజ్యాంగాన్ని కూడా చంద్రబాబు తగలబెడతాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ప్రజలచే ఎన్నుకోబడిన ప్రభుత్వం తెచ్చిన జీవోను బహిరంగంగా తగలబెట్టడాన్ని బట్టి.. భారతీయ చట్టం, ప్రజాస్వామ్యం పట్ల చంద్రబాబుకు ఏమాత్రం మర్యాదలేదని స్పష్టమవుతోంది. ఈరోజు ఆయన జీవోని తగలబెట్టాడు, రేపు ప్రజాస్వామ్యాన్ని కూడా తగలబెడతాడేమో. గతంలోనూ ఇలాగే ఒకరు బహిరంగంగా ప్రభుత్వ పత్రాలను చించివేసినప్పుడు ప్రజలు ఏమనుకున్నారో అందరికీ తెలుసు. నియంత పోకడలు అంటే ఇవే’’ అంటూ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.
Hema Malini: సింగర్‌గా మారిన అలనాటి అందాల నటి
అంతకుముందు.. కందుకూరు, గుంటూరు సంఘటనలు చోటు చేసుకున్నప్పుడు చంద్రబాబుపై ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. విషాదకర ఘటన నుంచి కూడా లబ్ధి పొందాలనే నీచ మనస్తత్వం ఉన్న రాజకీయ నేత ఒక్క చంద్రబాబు నాయుడేనని ధ్వజమెత్తారు. మరణంలోనూ కుల ప్రస్తావన చంద్రబాబుకే చెల్లిందని.. చంద్రబాబుకు ఫొటోషూట్, డ్రోన్ షాట్ పిచ్చి కారణంగానే కందుకూరులో 8 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. జనం పెద్దగా రాకపోయినా.. బాగా వచ్చారని చూపించడం కోసం ఒక చిన్న ఇరుకు రోడ్డులోకి జనాన్ని నెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన వాహనాన్ని అటుగా తీసుకెళ్లి మరీ 8 మందిని చంపారని ఆరోపణలు చేశారు. ఇంతకంటే ఘోరం ఎక్కడైనా ఉంటుందా? అని ప్రశ్నించారు. మన రాష్ట్రానికి ఇదేం ఖర్మ అంటూ ప్రజలు ఛీ కొడుతున్నా.. ఆయనకు పట్టింపులేదన్నారు. ఈ విషాదం నుంచి కూడా రాజకీయ ప్రయోజనం పొందడానికి శవాలపై పేలాలేరుకునే విధంగా పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు.
IND vs SL 3rd ODI: శతకాలతో చెలరేగిన గిల్, కోహ్లీ.. శ్రీలంక ముందు భారీ లక్ష్యం