శ్రీలంక టీ20 సిరీస్‌లో రెండు మ్యాచుల్లో డకౌట్ కావడంతో.. టీమిండియాలో మళ్లీ ఆడే అవకాశం వస్తుందని తాను అస్సలు ఊహించలేదని బ్యాటర్ సంజూ శాంసన్ అన్నాడు. తనపై నమ్మకం ఉంచిన మేనేజ్‌మెంట్‌కు ధన్యవాదాలు తెలిపాడు. భారత జట్టులో ప్రతి స్థానానికి తీవ్రమైన పోటీ ఉందని, మంచి ప్రదర్శన చేస్తే జట్టులో చోటు దక్కించుకోవడం పెద్ద కష్టమేం కాదని సంజూ పేర్కొన్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో టీ20 సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే. 47 బంతుల్లోనే 111 పరుగులు…