తెలంగాణలో గత కొంతకాలంగా హాట్ టాపిక్‌గా మారిన ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. బీఆర్ఎస్ (BRS) పార్టీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల అనర్హత వేటుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న తరుణంలో, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ మారిన వ్యవహారంలో మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇస్తూ ఆయన తీర్పునిచ్చారు. బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని…