అనంతపురం జిల్లా కుందుర్పి మండలం రుద్రంపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. మండలంలోని రుద్రంపల్లి గ్రామంలో పాత మిద్దె కూలి ముగ్గురు మృతి చెందారు. వర్షానికి నాని పాత మిద్దె కూలినట్లు స్థానికులు చెబుతున్నారు.
పూణె ర్యాష్ డ్రైవింగ్ ఘటన దేశాన్ని కుదిపేసింది. మైనర్లు అత్యంత వేగంగా కారు నడిపి ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల మరణానికి కారణమయ్యారు. పోలీసులు ఓ వైపు కఠిన చర్యలు చేపట్టినా.. ర్యాష్ డ్రైవింగ్‌లో మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా బెంగళూరులో కూడా ఇదే తరహాలో ఘటన చోటుచేసుకుంది
నవ్య ప్రింటింగ్ ప్రెస్ లో పోలీసుల తనిఖీలపై మండిపడ్డారు పీవో డబ్ల్యు సంధ్య. సాయంత్రం 5 గంటల సమయంలో మా ఇంటికి పోలీసులు వచ్చి మా భర్తను ప్రింటింగ్ ప్రెస్ కు తీసుకెళ్లారు. మధ్యాహ్నం సమయంలో ప్రింటింగ్ ప్రెస్ లో 50 మంది పోలీసులు వచ్చి బీభత్సం సృష్టించారన్నారు సంధ్య. ప్రింటింగ్ ప్రెస్ లో ఉన్న కంప్యూటర్లను, హార్డ్ డిస్క్ లను, ప్రింట్ అయిన పుస్తకాలను పోలీసులు తీసుకెళ్లారు. మా భర్తను అరెస్టు చేస్తున్నట్టు పోలీసులు చెప్పారు.…