తమిళనాడులోని హొసూరులో పుష్ప వినాయకుడు విగ్రహంపై తీవ్ర వివాదం చెలరేగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని హిందూ సంఘాలు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. హొసూరులో వినాయక చవితిని పురస్కరించుకుని ప్రజలు ఒక భారీ సెట్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా సినీ నటుడు అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సినిమాలోని గెటప్‌లో ఉన్న వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ విగ్రహంలో వినాయకుడు ఎర్రచందనం దుంగలను స్మగ్లింగ్ చేసే వ్యక్తిగా కనిపిస్తున్నాడు. దీంతో ఇది తీవ్ర చర్చకు దారితీసింది. Also…