అక్రమ ఇసుక రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టిన తహసీల్దార్ ఆ మాఫియాకు బిగ్ షాకిచ్చాడు. ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్ ను పట్టుకుని తానే స్వయంగా డ్రైవ్ చేస్తూ కార్యాలయానికి తరలించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండల ఆకేరు వాగు పరివాహక ప్రాంతాల్లో కొందరు వ్యక్తులు అక్రమ ఇసుక రవాణాకు పాల్పడుతున్నారు. ఇసుక అక్రమ రవాణా చేస్తున్న మాఫియా తహసిల్దార్ కార్యాలయ సిబ్బందికే సవాల్ విసిరుతున్నారు. ఇసుక బకాసురులపై…