ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని జుక్కల్, బాన్సువాడ, బోధన్ నియోజకవర్గాల్లో.. ఇసుక దందా జోరుగా నడుస్తోందన్న ఆరోపణలున్నాయి. హస్తం పార్టీ ద్వితీయ శ్రేణి నేతలు... ఇందులో మునిగి తేలుతున్నారట. ఎమ్మెల్యేల కనుసన్నల్లో కొంత.. వాళ్ళ పేర్లు చెప్పి మరింత దందా చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు.
ఇసుకతో పాటు ఇతర ఖనిజాల అక్రమ తవ్వకాలు, అక్రమ సరఫరాపై ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. గనుల శాఖపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష చేపట్టారు.
అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో రాజకీయ ఉత్కంఠత కొనసాగుతోంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఉమా శంకర్ గణేష్ తలపెట్టిన శాంతియుత ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. సెక్షన్ 30 పోలీస్ శాఖ యాక్ట్ అమలులోకి వచ్చింది. రాజకీయ ర్యాలీలు, ప్రదర్శనలపై ఆంక్షలు విధించారు పోలీసులు.
ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.. జస్టిస్ అభయ్, జస్టిస్ ఉజ్జల్ భూయన్ ధర్మాసనం ఈ విచారణ జరిపింది.. ఇసుక అక్రమ మైనింగ్ పై కీలక ఆదేశాలు వెలువరించింది సుప్రీంకోర్టు.. అక్రమ మైనింగ్ నిరోధానికి ప్రతి జిల్లాలో అధికారుల కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించింది.. కలెక్టర్, పోలీసులు, అధికారుల�
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడిపై మరో కేసు నమోదైంది. టీడీపీ హయాంలో ఇసుక అక్రమాలపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఏపీఎమ్‌డీసీ ఇచ్చిన ఫిర్యాదుతో ఏపీ సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ-1గా పీతల సుజాత, ఏ-2గా చంద్రబాబు, ఏ-3గా చింతమనేని ప్రభాకర్, ఏ-4గా దేవినేని ఉమాలు ఉన్నారు.
ఏపీలో ఇసుక తవ్వకాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు టీడీపీ ఫిర్యాదులు చేసింది. ఇసుక తవ్వకాల్లో అక్రమాలు జరుగుతున్నాయంటూ సీబీఐ, సీవీసీలకు టీడీపీ ఎంపీలు రామ్మోహన్ నాయుడు, కనకమేడల లేఖలు రాశారు. ఎంఎస్టీసీ వేదికగా ఇసుక అక్రమాలకు ఏపీ ప్రభుత్వం తెర లేపిందని టీడీపీ లేఖల్లో పేర్కొంది.