బీటౌన్‌లో గత ఏడాదంతా హారర్ కామెడీలదే హవా. కానీ ఈ ఏడాది యాక్షన్ ఎంటర్టైనర్లకు పట్టం కడతారు అనుకుంటే.. డిఫరెంట్‌గా.. హిస్టారికల్ అండ్ లవ్ స్టోరీలకు ఊహించని సక్సెస్ ఇచ్చారు. ముఖ్యంగా భావోద్వేగాలతో కూడిన ప్రేమ కథలపై మక్కువ పెంచుకున్నారు. అందుకు ఎగ్జాంపుల్స్ సనమ్ తేరీ కసమ్, సైయారా. అక్కడ ఆడియన్స్ లవ్ స్టోరీలు చూడక కరువులో ఉన్నారేమో.. ప్లాప్ సినిమా సనమ్ తేరీ కసమ్‌ను రీ రిలీజ్‌లో బ్లాక్ బస్టర్ హిట్ చేసేశారు. Also Read…
రీ రిలీజ్‌లో సనమ్ తేరీ కసమ్ ఊహించని హిట్ అందుకోవడంతో ఆ హోప్‌తో నెక్ట్స్ కూడా రొమాంటిక్ ఫిల్మ్ రెడీ చేస్తన్నాడు హర్షవర్థణ్ రాణే. కర్ణాటకలో అనుష్క ఘాటీని రిలీజ్ చేసే బాధ్యతను తీసుకున్నారు రాకీ భాయ్ మదర్. ఖైదీ2 మరింత వాయిదా పడుతున్న నేపథ్యంలో కార్తీ మరో దర్శకుడ్ని లైన్లో పెట్టాడు. వీటి ఫుల్ డిటైల్స్ మీకోసం… Tollywood : అనుష్క- క్రిష్ జాగర్లమూడి కాంబోలో తెరకెక్కుతోన్న ఫిల్మ్ ఘాటీ. విక్రమ్ ప్రభు కీ రోల్…
హర్షవర్ధన్ రాణే, పాకిస్థానీ నటి మావ్రా హొకేన్ జంటగా నటించిన 'సనమ్ తేరి కసమ్' చిత్రం 2016లో విడుదలైంది. ఆ సమయంలో ఈ ప్రేమకథా చిత్రం ప్రత్యేక గుర్తింపును పొందింది. ఆ చిత్రంలోని పాటలు కూడా బాగా ఆకట్టుకున్నాయి. ఇటీవల ఈ సినిమా మళ్ళీ విడుదలైంది. హిందీలో రీ-రిలీజ్ తర్వాత 'సనమ్ తేరి కసమ్' చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు సాధిస్తోంది.