2025 దసరా సందర్భంగా ‘సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ’ సారథ్యంలో ఏపీ ప్రభుత్వ సహకారంతో ఉత్సవాలు నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించి ‘విజయవాడ ఉత్సవ్’ పేరుతో కర్టెన్ రైజర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంకు హీరోయిన్ సంయుక్త మీనన్ హాజరయ్యారు. ‘విజయవాడ అందమైన సిటీ. విరూపాక్ష సినిమా రిలీజ్ ముందు అమ్మవారి దర్శనం చేసుకున్నాను. విజయవాడ ఉత్సవ్ ఒక విజన్‌తో చేస్తున్నారు. ప్రజలందరి మద్దతుతోనే విజయవాడ ఉత్సవ్ సక్సెస్ అవుతుంది. సెప్టెంబరు 22 నుంచి అక్టోబర్ 2 వరకూ…