శాంసంగ్ పేరు వినగానే మీ మదిలో ఏ ఫొటో వస్తుంది..? మొబైల్ ఫోన్, ఫ్రిజ్, టీవీ, గృహోపకరణాల కనిపిస్తాయి. కానీ.. ఈ కంపెనీ మొదట్లో ఏం చేసేది? అనే విషయం తెలిస్తే అందరూ షాక్ అవ్వాల్సిందే. శాంసంగ్ మార్చి 1, 1938న ప్రారంభమైంది. దాని వ్యవస్థాపకుడు లీ బైయుంగ్-చుల్. దక్షిణ కొరియాలోని డేగు నగరంలో ప్రారంభమైన కంపెనీ.. మొదట్లో ఎండిన చేపలు, పండ్లు, నూడుల్స్ విక్రయించే దుకాణాన్ని ప్రారంభించారు. అనంతరం రవాణా, రియల్ ఎస్టేట్, బీమా, బ్రూయింగ్…