సినీ నటుడు సుధీర్ బాబు దాతృత్వాన్ని చాటుకున్నారు. రెండున్నర నెలల చిన్నారి సంస్కృతి జాస్మిన్ పేరిట లక్షన్నర నగదు డిపాజిట్ చేశారు సుధీర్ బాబు. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలంలోని కేశవరాయునిపాలెం గ్రామానికి చెందిన సంస్కృతి జాస్మిన్ పుట్టుకతోనే గుండెసమస్యతో బాధపడుతుంది. ఆమె ఆపరేషన్ కోసం, ఇతర వైద్య ఖర్చుల కోసం 3.5 లక్షలు కావాల్సి ఉండగా.. సంస్కృతికి గతంలో లక్షా 70 వేలు ఖర్చు చేసి వైద్యం అందేలా సహాయపడ్డాడు సుధీర్ బాబు. తాజాగా ఆయన…
యంగ్ హీరో సుధీర్ బాబు ఎమర్జెన్సీ అంటూ ఓ చిన్నారి ప్రాణాలను రక్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. “ఎమర్జెన్సీ: బేబీ సంస్కృత గుండె సమస్యలను ఎదుర్కొంటోంది. ఆమె ఆపరేషన్ ప్రారంభించడానికి నేను 1 లక్షలు అందిస్తున్నాను. కాని ఆమె ఆపరేషన్ కోసం, ఇతర వైద్య ఖర్చుల కోసం 3.5 లక్షలు కావాలి. కాబట్టి నేను వ్యక్తిగతంగా నిధులు సేకరిస్తున్నాను. దయచేసి సహకరించండి” అంటూ ట్వీట్ చేశారు. హార్ట్ ప్రాబ్లమ్ తో బాధపడుతున్న ఆ చిన్నారిని కాపాడడానికి ఎవరన్నా ముందుకు…