తరగని కళాతృష్ణ, చెరిగిపోని నటనాపిపాస వెరసి నటరత్న యన్.టి.రామారావు అని అంటే అతిశయోక్తి కాదు. తెరపై పట్టువదలని విక్రమార్కునిగా నటించిన యన్.టి.రామారావు నిజజీవితంలోనూ అదే తీరున సాగారు. ఓ సారి తలచుకుంటే, దానిని సాధించేదాకా నిదురపోని నైజం యన్టీఆర్ ది! ప్రపంచవ్యాప్తంగా బౌద్ధం పరిఢవిల్లడానికి కారణమైన సమ్రాట్ అశోకుని పాత్ర పోషించాలన్న తలంపు యన్టీఆర్ మదిలో బ్రహ్మంగారి చరిత్ర చిత్రం రూపకల్పన సమయంలోనే నాటుకుంది. తరువాత రాజకీయ ప్రవేశం, ఆ తరువాత రాజకీయాల్లోనూ ఆయన జైత్రయాత్ర, ముఖ్యమంత్రిగా…