UP Police: హోలీ పండగ, రంజాన్ మాసంలో శుక్రవారం నమాజ్ ఒకే రోజు కలిసి రావడంతో మతపరమైన సున్నిత పరిస్థితులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఉత్తర్ ప్రదేశ్ సంభాల్ ప్రాంతంలో ఇలాంటి పరిస్థితులు మరింత ఎక్కువగా ఉంటాయి. గతేడాది నవంబర్ నెలలో సంభాల్ జామా మసీదు సర్వే సమయంలో పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి. ఈ అల్లర్లలో నలుగురు వ్యక్తులు మరణించడంతో పాటు పలువురు పోలీసులకు గాయాలయ్యాయి