Odela 2: మిల్కీ బ్యూటీ తమన్నా.. గ్లామర్ పాత్రలను కట్టిపెట్టి.. లేడీ ఓరియెంటెడ్ సినిమాలపై ఫోకస్ పెంచుతుంది. ఇప్పటికే ఆమె ప్రధాన పాత్రలో నటించిన సినిమాలు మంచి విజయాలనే అందుకున్నాయి. ఇక తాజాగా మరో లేడీ ఓరియెంటెడ్ సినిమాకు తమ్ము బేబీ ఓకే చెప్పింది. హెబ్బా పటేల్, పూజిత పొన్నాడ, వశిష్ఠ ప్రధాన పాత్రల్లో నటించిన ఓదెల రైల్వే స్టేషన్ సినిమా గుర్తుంది కదా.