Samantha : మన తెలుగు ప్రేక్షకులు సినీ నటులను ఎంతగా ప్రేమిస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వారి కోసం ఏం చేయడానికైనా రెడీ అవుతారు. భారీ కటౌట్లు పెట్టేస్తారు. ఇంకొందరు రక్తదానాలు, అన్నదానాలు చేసేస్తారు. ఇక పాలాభిషేకాలు, పూలాభిషేకాలకు కొదువే లేదు. అయితే కొందరు హీరోయిన్లకు గుడి కట్టడాన్ని కూడా మనం చూస్తుంటాం. ఇప్పటికే తమిళనాడులో ఖుష్బూ, నయనతార, హన్సిక లాంటి వారికి గుడులు కట్టేశారు అభిమానులు. తాజాగా హీరోయిన్ సమంతకు కూడా గడి కట్టేశాడో ఓ వీరాభిమాని.…