Samantha : మన తెలుగు ప్రేక్షకులు సినీ నటులను ఎంతగా ప్రేమిస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వారి కోసం ఏం చేయడానికైనా రెడీ అవుతారు. భారీ కటౌట్లు పెట్టేస్తారు. ఇంకొందరు రక్తదానాలు, అన్నదానాలు చేసేస్తారు. ఇక పాలాభిషేకాలు, పూలాభిషేకాలకు కొదువే లేదు. అయితే కొందరు హీరోయిన్లకు గుడి కట్టడాన్ని కూడా మనం చూస్తుంటాం. ఇప్పటికే తమిళనాడులో ఖుష్బూ, నయనతార, హన్సిక లాంటి వారికి గుడులు కట్టేశారు అభిమానులు. తాజాగా హీరోయిన్ సమంతకు కూడా గడి కట్టేశాడో ఓ వీరాభిమాని. ఏపీలోని బాపట్లకు చెందిన ఓ వీరాభిమాని గుడి కట్టి అందులో గోల్డెన్ కలర్ లో సమంత విగ్రహాన్ని కూడా పెట్టేశాడు.
Read Also : Nani : నాని ఏంటీ మాటలు.. లింకులు పెట్టడం అవసరమా..?
ఈ రోజు సమంత పుట్టిన రోజు సందర్భంగా ఆ గుడి వద్ద కేక్ కట్ చేశాడు. అలాగే కొందరికి అన్నదానం కూడా చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇది చూసిన సమంత ఫ్యాన్స్ కొందరు వావ్ అంటున్నారు. ఇంకొందరేమో ఇలాంటివి అవసరమా అంటూ విమర్శిస్తున్నారు. సమంత ప్రస్తుతం నిర్మాతగా చేస్తున్న శుభం సినిమాతో రాబోతోంది. ఆమె హీరోయిన్ గా నటించి చాలా రోజులు అవుతోంది. త్వరలోనే ఓ భారీ సినిమాతో వస్తుందనే ప్రచారం అయితే ఉంది.