మొఘల్స్ ఆఖరి చక్రవర్తి ఔరంగజేబు దేవాలయాలను నిర్మించాడని, క్రూరమైనవాడు కాదని మహారాష్ట్రలోని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అబూ అజ్మీ ప్రశంసించారు. దీంతో ఆ కామెంట్స్ వివాదానికి దారితీసింది. ఇక, ఎస్పీ చీఫ్ పై బీజేపీ నేత, మాజీ ఎంపీ నవనీత్ కౌర్ రాణా తీవ్ర విమర్శలు గుప్పించారు.