Mayawati: పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడనే ఆరోపణలతో పార్టీ నేతని బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) చీఫ్ మాయావతి సస్పెండ్ చేసింది. అయితే, అతను చేసిన తప్పు ఏంటంటే, సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) నేత కుమార్తెతో తన కొడుకు వివాహం జరిపించడమే. ఎస్పీ ఎమ్మెల్యే తిభువన్ దత్ కుమార్తెతో కొడుకు పెళ్లి చేసినందుకు సురేంద్ర సాగర్‌ని బీఎస్పీ నుంచి బహిష్కరించారు. ఇతడితో పాటు రాంపూర్ జిల్లా బీఎస్పీ అధ్యక్షుడు ప్రమోద్ సాగర్‌ని తొలగించారు.