బండి సంజయ్ సంగ్రామ యాత్రలో కొత్త కమలాలు కనిపిస్తున్నాయా? పాత వాసనలు.. పాతకాలపు పోకడలకు చెక్ పెట్టారా? లేక వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తున్నారా? మారిన పరిణామాలు పార్టీసారథికి.. బీజేపీకి వర్కవుట్ అవుతాయా? సంజయ్ యాత్రలో కనిపిస్తున్న సిత్రాలపై చర్చ! యాత్ర అనే పేరు లేకుండా బీజేపీని ఊహించలేం. రథయాత్ర ద్వారా దేశంలో పార్టీ బలోపేతం కావడంతో.. ఇప్పుడు తెలంగాణలో బీజేపీని పటిష్ఠం చేయడానికి ప్రజా సంగ్రామ యాత్రను నమ్ముకున్నారు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఆగస్టు 28న…