ముంబై ట్రాఫిక్ పోలీసుల వాట్సాప్ నంబర్‌కు బెదిరింపు మెసేజ్ వచ్చిందని తెలిపారు. ఈ మెసేజ్ లో సల్మాన్ ఖాన్ నుంచి ఐదు కోట్ల రూపాయలు ఇప్పించాలనే డిమాండ్ ఉందన్నారు. అలాగే, సల్మాన్ ఖాన్ బ్రతికి ఉండి.. లారెన్స్ బిష్ణోయ్‌తో ఉన్న శత్రుత్వాన్ని అంతం చేసుకోవాలంటే.. తమకు 5 కోట్లు చెల్లించాలని ఓ సందేశం గుర్తు తెలియని నంబర్ నుంచి వచ్చింది.
సల్మాన్ ఖాన్ బెదిరింపు లేఖ కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బడా వ్యాపారవేత్తలు, నటుల నుంచి డబ్బు వసూలు చేయడానికే లేఖ పంపినట్లు మహారాష్ట్ర హోంశాఖ వెల్లడించింది. పంజాబీ గాయకుడు సిద్ధూ మూస్ వాలా మరణించిన కొద్ది రోజులకే, ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్, అతని తండ్రికి హత్య చేస్తామంటూ బెదిరింపు లేఖ వచ్చింది. సల్మాన్ తండ్రి స్థానికంగా ఉన్న ఓ పార్కులో జాగింగ్‌కు వెళ్లగా.. అక్కడే ఓ బెంచీ…