గత 24 గంటలుగా సోషల్ మీడియాలో టాప్ ట్రెండ్ అవుతూనే ఉన్నాయి సలార్, ప్రభాస్, సలార్ సీజ్ ఫైర్ ట్యాగ్స్. పది రోజుల్లో సలార్ ట్రైలర్ రిలీజ్ అవుతుండడంతో ప్రభాస్ ఫ్యాన్స్ లో మరింత జోష్ పెరిగింది. దీంతో ప్రభాస్ ఫోటోలని పోస్ట్ చేస్తూ టాప్ ట్రెండ్ చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ‘సలార్ ర్యాంపేజ్ ఇన్ ఏ మంత్’ అనే ట్రెండ్ ని ప్రభాస్ ఫ్యాన్స్ నేషనల్ వైడ్ చేస్తున్నారు. ఈరోజు నవంబర్ 22… సరిగ్గా నెల రోజుల తర్వాత డిసెంబర్ 22న సలార్ నుంచి పార్ట్ 1 సీజ్ ఫైర్ రిలీజ్ కానుంది. ఇండియన్ బాక్సాఫీస్ ని సీజ్ చేయడానికి బయటకి రానున్న ఈ మూవీ… కలెక్షన్స్ కి ఒక కొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేయనుంది. అయితే కొంతమందిలో మాత్రం ప్రభాస్ గత సినిమాల రిజల్ట్ దృష్టిలో పెట్టుకోని సలార్ కలెక్షన్స్ పై సందేహ పడుతున్నారు. బిజినెస్ చాలా ఎక్కువ చేసింది అంతే కలెక్షన్స్ రాబట్టకుంటే బ్రేక్ ఈవెన్ అవ్వడం కష్టం అనే కామెంట్స్ అక్కడక్కడా వినిపిస్తున్నాయి.
Get ready for the explosive #SalaarCeaseFire Trailer releasing on Dec 1st @ 19:19 IST 💣#Salaar North America bookings open from today! 🎟️
SALAAR RAMPAGE IN A MONTH#Prabhas #PrashanthNeel @PrithviOfficial @shrutihaasan @hombalefilms @VKiragandur @IamJagguBhai @sriyareddy… pic.twitter.com/HcfFnymhSe
— Salaar (@SalaarTheSaga) November 21, 2023
ప్రభాస్ బాహుబలి 2 తర్వాత నటించిన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు ఫ్లాప్ అయ్యి, బయ్యర్స్ ని నష్టాలు తెచ్చిన మాట వాస్తవమే కానీ ఫ్లాప్ సినిమాతో కూడా ప్రభాస్ 450-550 కోట్లు రాబట్టాడు. ఎంత రాబట్టాడు అని పాత సినిమా లెక్కలు వేసుకోని, సలార్ తో కంపేర్ చేయడానికి… పోయిన మూడు సినిమాలకి రాబోయే సలార్ కి జమీన్-ఆస్మాన్ ఫరక్ ఉంది. KGF2 సినిమాతో 1200 కోట్లు చేసిన ప్రశాంత్ నీల్. ప్రస్తుతం ఇండియాలో రాజమౌళి తర్వాత ఆ రేంజ్ ని మైంటైన్ చేస్తున్న ఏకైక దర్శకుడు. ఇలాంటి డైరెక్టర్ కి ప్రభాస్ దొరికితే రిజల్ట్ ఏ రేంజులో ఉంటుందో టీజర్ తో శాంపిల్ చూపించాడు ప్రశాంత్ నీల్. టీజర్ తో క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ని ట్రైలర్ తో ప్రశాంత్ నీల్ మరింత పెంచుతాడు. ఈ డెడ్లీ కాంబినేషన్ ప్రత్యేకించి చెయ్యాల్సింది ఏమీ లేదు, ప్రెజెంట్ ఉన్న అంచనాలని అందుకుంటే చాలు. సలార్ సినిమా ఎంత బిజినెస్ నైనా ఊది అవతలేస్తుంది. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం సలార్ కౌంట్ వెయ్యి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది అనేది చూడాలి.