భూముల రీ-సర్వేపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టిందన్నారు సీసీఎల్ఏ చీఫ్ కమిషనర్ సాయి ప్రసాద్. భూముల రీ-సర్వే అనేది సీఎం జగన్ మానస పుత్రిక. ప్రతి 30 ఏళ్లకోసారి రీ-సర్వే చేయాలని నిబంధనలు.కానీ పొలం గట్ల తగాదాలు వస్తాయి.. పెద్ద గొడవలు అవుతాయనే ఆందోళనతో ఎవ్వరూ రీ-సర్వే చేయించేందుకు సాహసించ లేదు. దీంతో ఎప్పుడో బ్రిటీష్ కాలం నాటి సర్వే వివరాలే ఉన్నాయన్నారు. కానీ సీఎం జగన్ సాహసంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రీ-సర్వేలో భాగంగా ఏమైనా…