నేచురల్ స్టార్ నాని “బయటెక్కడో ఉన్నాడు… ఉండకూడదు” అంటూ ట్వీట్ చేశారు. అయితే ఇది సినిమాల గురించి కాదు. ఆరేళ్ళ చిన్నారిపై జరిగిన హత్యాచార ఘటనపై నాని స్పందన. సైదాబాద్ లోని సింగరేణి కాలనీలో ఓ ఆరేళ్ళ చిన్నారిని క్రూరంగా హత్యాచారం చేసిన నిందితుడిపై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ప్రజలతో పాటు సెలెబ్రిటీలు సైతం ఈ అమానవీయ ఘటనపై మండిపడుతున్నారు. పోలీసులు త్వరగా నిందితుడిని పట్టుకోవాలని, వాడిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. ఈ పరిస్థితుల్లో నిందితుడు…
సైదాబాద్ చిన్నారి అత్యాచారం, హత్యకేసులో నిందితుడు రాజు కోసం వేట కొనసాగుతోంది. ఆరు రోజులు గడుస్తున్నా… అతడి ఆచూకీ లభించలేదు. దీంతో నిందితుడిని పట్టుకునేందుకు 100 మందితో 10 బృందాలను ఏర్పాటు చేశారు పోలీసులు. అతని దగ్గర సెల్‌ఫోన్ లేకపోవడంతో… ఆచూకీ కనుక్కోవడం కష్టంగా మారినట్టు తెలుస్తోంది. ఎలాగైనా నిందితుడిని పట్టుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా నాకాబందీ నిర్వహిస్తోంది పోలీస్‌శాఖ. ఆర్టీసీ ఉద్యోగులను కూడా అలెర్ట్ చేశారు. అన్ని బస్టాండ్‌లు, బస్సుల్లో నిందితుడికి సంబంధించిన పోస్టర్లు అంటించారు. నిందితుడి…