హైదరాబాద్ లోని సింగరేణి కాలనీలో బాలికపై అత్యాచారం, హత్య చేసిన నిందితుడి కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. ఈ కేసును తెలంగాణ పోలీసులు ఛాలెంజ్ గా తీసుకొని నిందితుడి ఆచూకీ కోసం వెతుకుతున్నట్లు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ నిందితుడు తప్పించుకునే అవకాశం లేకుండా డీజీపీ నేరుగా మానిటరింగ్ చేస్తున్నారు. అయితే గత ఆరురోజులుగా పోలీసులు నిందితుడు కోసం గాలింపు చర్యలు చేపడుతున్నా రాజు ఆచూకీ లభించకపోవడం గమనార్హం. నిందుతుడు నిర్మానుష్య ప్రదేశంలో దాక్కొని ఉండి ఉంటారని…
నేచురల్ స్టార్ నాని “బయటెక్కడో ఉన్నాడు… ఉండకూడదు” అంటూ ట్వీట్ చేశారు. అయితే ఇది సినిమాల గురించి కాదు. ఆరేళ్ళ చిన్నారిపై జరిగిన హత్యాచార ఘటనపై నాని స్పందన. సైదాబాద్ లోని సింగరేణి కాలనీలో ఓ ఆరేళ్ళ చిన్నారిని క్రూరంగా హత్యాచారం చేసిన నిందితుడిపై రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ప్రజలతో పాటు సెలెబ్రిటీలు సైతం ఈ అమానవీయ ఘటనపై మండిపడుతున్నారు. పోలీసులు త్వరగా నిందితుడిని పట్టుకోవాలని, వాడిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. ఈ పరిస్థితుల్లో నిందితుడు…
హైదరాబాద్ లోని సైదాబాద్ సింగరేణి కాలనీలో హత్యాచారానికి గురైన చిన్నారి ఘటనపై నటుడు మహేష్ బాబు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే చర్యలు చేపట్టి ఆ కుటుంబానికి న్యాయం చేయాలనీ అధికారులను మహేష్ కోరారు. సమాజం ఎంతగా పడిపోయిందో ఈ ఘటన గుర్తుచేస్తుందన్నారు. ఆడపిల్లలు ఎప్పుడు సురక్షితంగా ఉంటారా? అనేది ఎల్లప్పుడూ ఒక ప్రశ్నగానే మిగిలిపోతుందని మహేష్ బాబు ఆవేదనగా ట్వీట్స్ చేశారు. నటుడు మంచు మనోజ్ కూడా ఈరోజు చిన్నారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ…
హైదరాబాద్ నడిబొడ్డులోని సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య ఘటన తీవ్ర కలకలం రేపుతోంది… ఘటన జరిగి వారం కావస్తున్నా.. నిందితుడు ఆచూకీ ఇప్పటి వరకు లభించలేదు.. దీంతో.. హైదరాబాద్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు.. సైదాబాద్ చిన్నారి కేసుపై ఉన్నతస్థాయి నిర్వహించారు.. హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ నేతృత్వంలో సమావేశం జరిగింది.. నిందితుడి కోసం 100 మంది పోలీసులతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.. 10 పోలీసు బృందాలతో నిందితుడికోసం వేట కొనసాగుతోందని తెలిపారు. ఇదే…