శంకర్ పిక్చర్స్ సమర్పణలో సాయి తేజ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సాయి రామ్ శంకర్, యషా శివకుమార్ జంటగా నవీన్ రెడ్డి దర్శకత్వంలో దేవరాజ్ పొత్తూరు నిర్మిస్తున్న చిత్రం ‘వెయ్ దరువెయ్’. ఈ సినిమా శుక్రవారం రామానాయుడు స్టూడియోలో సినీ ప్రముఖుల సమక్షంలో ప్రారంభమైంది. హీరో, హీరోయిన్ పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి శర్వానంద్ క్లాప్ కొట్టగా అల్లరి నరేష్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. విశ్వక్ సేన్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా సాయి రామ్…