కొత్త సంవత్సరం ఆది సాయికుమార్ నటించిన ‘అతిథి దేవో భవ’ చిత్రం విడుదలైంది. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఇలా జనంలోకి వెళ్ళిందో లేదో… అలా ఆది సాయికుమార్ ఇంటికి సరికొత్త బెంజ్ కారు వచ్చేసింది. సినిమా హీరోలకు హైటెక్ కార్లు కొనడం, అందులో తిరగడం అనేది ఓ సరదా! కెరీర్ లో స్టెప్ బై స్టెప్ ఎదుగుతున్న క్రమంలో అవకాశం చిక్కితే చాలు కార్లనూ మార్చేస్తుంటారు. పాత వాటి స్థానంలో హైఎండ్ కారు కొనుగోలు చేస్తుంటారు.…
(డిసెంబర్ 23న ఆది సాయికుమార్ పుట్టినరోజు)తాత పి.జె.శర్మ, తండ్రి సాయికుమార్, బాబాయిలు రవిశంకర్, అయ్యప్ప శర్మ బాటలోనే పయనిస్తూ ఆది నటనలో అడుగుపెట్టాడు. ఆరంభంలో ఆదిగానే కనిపించినా, మరో ఆది కూడా ఉండడంతో ‘ఆది సాయికుమార్’గా మారిపోయాడు. తొలి చిత్రం ‘ప్రేమ కావాలి’తోనే హీరోగా సాలిడ్ సక్సెస్ ను సొంతం చేసుకున్న ఆది అప్పటి నుంచీ వైవిధ్యం ప్రదర్శిస్తూ ముందుకు సాగుతున్నాడు. నటుడు సాయికుమార్, సురేఖ దంపతులకు 1989 డిసెంబర్ 23న ఆది జన్మించాడు. ఆది పూర్తి…
(డిసెంబర్ 19తో పోలీస్ స్టోరీకి 25 ఏళ్ళు)అప్పటి దాకా తనదైన గాత్రంతో ఎంతోమందిని స్టార్స్ గా నిలిపిన ప్రముఖ నటుడు సాయికుమార్ ను స్టార్ గా మలచిన చిత్రం పోలీస్ స్టోరీ. తెలుగువారయిన సాయికుమార్ కు నటనంటే ప్రాణం. అయితే ఆయనకు తగ్గ పాత్రలు తెలుగులో అంతగా లభించలేదు. దాంతో తమిళ, కన్నడ చిత్రాల్లోనూ అందివచ్చిన పాత్రల్లో నటించేవారు. సాయికుమార్ యాక్టింగ్ లో మహానటుడు శివాజీగణేశన్ కనిపిస్తారని, అప్పట్లో కన్నడిగులు అనేవారు. దానిని ఆధారం చేసుకొని ప్రముఖ…
బిబిసి స్టూడియోస్ నిర్మించిన ఒక యురోపియన్ డ్రామాను తెలుగు ప్రేక్షకుల అభిరుచుల మేరకు మార్పులు చేసి ‘గాలివాన’ అనే ఒరిజినల్ సిరీస్ గా నిర్మిస్తోంది జీ 5 సంస్థ. బి.బి.సి. స్టూడియోస్, నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ భాగస్వామ్యంతో ఇది రూపుదిద్దుకుంటోంది. ఇందులో సీనియర్ నటి రాధిక శరత్ కుమార్, సాయి కుమార్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. చాందినీ చౌదరి, నందిని రాయ్, చైతన్య కృష్ణ, తాగుబోతు రమేష్, జ్యోతి ప్రదీప్, ఆశ్రిత వేముగంటి ఇతర తారాగణం. 50…
అశేష తెలుగు అభిమానులను శోక సంద్రంలో ముంచేస్తూ మరో తెలుగు దిగ్గజం సిరివెన్నెల నేలకొరిగిన విషయం తెలిసిందే. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో న్యుమోనియాకు చికిత్స పొందుతూ నవంబర్ 30న సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూశారు. ఈరోజు ఉదయం ఆయన పార్థివదేహాన్ని ఆసుపత్రి నుంచి ఫిల్మ్ ఛాంబర్ కు తరలించారు. అభిమానుల సందర్శనార్థం సిరివెన్నెల పార్థివదేహాన్నిమధ్యాహ్నం వరకు అక్కడ ఉంచి 12 గంటల సమయంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. Read Also : సిరివెన్నెల పార్థీవదేహం వద్ద కన్నీరుమున్నీరైన తనికెళ్ళ తాజాగా…
ప్రముఖ నటుడు డైలాగ్‌కింగ్ సాయికుమార్‌ను ఇన్‌కమ్‌టాక్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వారు హైదరాబాద్‌లో ఘనంగా సత్కరించారు. భారతదేశానికి స్వాతంత్య్రం లభించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మన దేశ ప్రధాని నరేంధ్ర మోడి నేతృత్వంలో 2021 మార్చి 12న ప్రారంభమై 2022 ఆగస్టు 15వరకు 75వారాలపాటు జరిగే కార్యక్రమమే ‘‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’’. ఈ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌లోని ఐటీ శాఖవారు అనేక రంగాల్లో లబ్దప్రతిష్ఠులైన కొంతమందిని ఎంపికచేసి సత్కరించారు. తోలుబొమ్మలాట కళాకారులు…
సీనియర్ నటుడు సాయి కుమార్, సాయి శ్రీనివాస్, ఐశ్వర్య, విజయ్ చందర్, రాజీవ్ కనకాల ప్రధాన పాత్రధారులుగా శాంతి కుమార్ తుర్లపాటి దర్శకత్వంలో ప్రశాంత్ టంగుటూరి నిర్మిస్తున్న చిత్రం ‘నాతో నేను’. విజయదశమి సందర్భంగా ఈ చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాదులో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్, ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి , హీరో ఆది సాయి కుమార్ తదితర సినీ, రాజకీయ…
(జూలై 27న నటుడు, నిర్మాత సాయికుమార్ బర్త్ డే) సాయి కుమార్ కంచు కంఠం అంటే తెలుగువారికే కాదు, కన్నడిగులకూ ఎంతో అభిమానం. సాయి కుమార్ గళం నుండి జాలువారే ప్రతిపదం ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకుంటుంది. ఆయన గాత్రదానంతో ఎంతోమంది స్టార్స్ గా రాణించారు. అనువాద చిత్రాలకు సాయి గళం ఓ పెద్ద ఎస్సెట్. ఇక నటునిగానూ సాయి తనదైన బాణీ పలికించి జనాన్ని ఆకట్టుకున్నారు. పదహారేళ్ళ ప్రాయంలోనే బాపు తెరకెక్కించిన ‘స్నేహం’లో నటించిన సాయికుమార్ తరువాత…