Sai Dharam Tej: మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్, ప్రస్తుతానికి 'సంబరాల ఏటిగట్టు' అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. 'హనుమాన్' నిర్మాతలు చైతన్య, నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాని కొత్త దర్శకుడు రోహిత్ కె.పి. అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా కోసం 125 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ చూస్తే, సినిమా ఏదో భిన్నంగానే ఉండేలా కనిపిస్తోంది.