VC Sajjanar : సోషల్ మీడియా ఫేమ్ కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టే పరిస్థితి పెరుగుతోంది. తాజాగా ఇలాంటి సంఘటనపై టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ మండిపడ్డారు. వైరల్ వీడియోలో ఒక యువకుడు రైలు పట్టాలపై పడుకొని, తనపై నుంచి రైలు పోతుండగా వీడియో తీయించుకొని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియోను షేర్ చేసిన సజ్జనార్, సోషల్ మీడియా మత్తులో పడిన ఇలాంటి యువతపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. “పిచ్చికి పరాకాష్ట..…