ONGC Pipeline Leak: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రెండో రోజు బ్లో అవుట్ కొనసాగుతున్నాయి. మల్కిపురం మండలం ఇరుసుమండలోని బావిలో నుంచి భారీగా లీక్ కావడంతో మంటలు ఎగిసి పడుతున్నాయి. దీంతో ఈరోజు ఢిల్లీ నుంచి ఓఎన్జీసీ నిపుణుల బృందం రానుంది.
పంజాబ్ అమృత్‌సర్‌లో హైఅలర్ట్ కొనసాగుతోంది. ప్రభుత్వం మరోసారి ప్రజలకు కీలక సూచనలు చేసింది. చాలా జాగ్రత్తగా ఉండాలని.. దయచేసి ఇళ్లలో లైట్లు ఆపి, కిటికీలకు దూరంగా ఇంటి లోపల ఉండాలని సూచించింది. దయచేసి రోడ్డు, బాల్కనీ లేదా టెర్రస్‌పైకి వెళ్లవద్దని తెలిపింది. భయపడవద్దని.. సాధారణ కార్యకలాపాలను ఎప్పుడు తిరిగి ప్రారంభిస్తామో తెలియజేస్తామని ప్రకటించింది. ఈ సమాచారాన్ని అమృత్‌సర్ డీసీ ఉదయం 4.39 గంటలకు జారీ చేసిన మార్గదర్శకంలో తెలిపింది.