Calorie Deficit: బరువు తగ్గాలనుకునే వాళ్లు, జిమ్‌కు వెళ్లేవాళ్లు లేదా సోషల్ మీడియాలో ఫిట్‌నెస్ వీడియోలు చూసేవాళ్లు తరచూ వినే మాట కేలరీ డెఫిసిట్. కానీ ఈ మాట విన్నా చాలామందికి దాని అర్థం ఏమిటో స్పష్టంగా తెలియదు. కొందరైతే “తక్కువ తినాలి” అని భావిస్తారు. మరికొందరు “ఆకలితో ఉండాలి” అని అనుకుంటారు. కానీ నిజానికి కేలరీ డెఫిసిట్ అర్థం అది కాదు. మన శరీరం రోజంతా ఎన్నో పనులు చేస్తుంది. ఊపిరి తీసుకోవడం, నడవడం, పని…