Pawan Kalyan: ప్రకృతిని పరమేశ్వరి ప్రతిరూపంగా ఆరాధించడం భారతీయ సనాతన ధర్మంలో ఒక గొప్ప ఆచారం అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అటువంటి ప్రకృతిలో ఆకృతి తొడిగే పుష్పాలను బతుకమ్మలుగా పూజించడం తెలంగాణ ఆడపడుచుల సంప్రదాయం.. దేవి నవరాత్రులతో ఆరంభమయ్యే బతుకమ్మల పూజలు, ఆటలు నేటి సద్దుల బతుకమ్మతో ముగియనున్న తరుణంలో నా పక్షాన, జనసేన శ్రేణుల పక్షాన భక్తిపూర్వక శుభాకాంక్షలు అని జనసేన అధినేత పేర్కొన్నారు.