చంద్రబాబు భద్రతపై లోకేష్ చేసిన ట్వీట్ పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉదయం లోకేష్ ట్వీట్ చూసి బాధ అనిపించిందన్నారు. చంద్రబాబు భద్రత విషయంలో లోకేష్ వ్యక్తం చేసిన ఆందోళనను ఒక కొడుకుగా అర్థం చేసుకోగలనని తెలిపారు. లోకేష్ చెప్పింది వాస్తవం అయితే ఈ పరిస్థితి భాదకరమని కేటీఆర్ పేర్కొన్నారు. తనకు ప్రస్తుతం ఉన్న పరిస్ధితుల నిజానిజాలు తెలియవు, కానీ ఆయన భద్రతకు ప్రమాదం అయితే రాజకీయల్లో ఇది దురదృష్టకరమని తెలిపారు.