బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు మాజీ సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగం, సహనం.. ఈ రెండూ బక్రీద్ పండుగ ఇచ్చే సందేశాలని పేర్కొన్నారు. దైవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ బక్రీద్ పండగ జరుపుకుంటారని.. త్యాగనిరతికి బక్రీద్ పండుగ నిదర్శనమన్నారు. ధనిక, పేద అన్న తారతమ్యం లేకుండా రాగద్వేషాలకు అతీతంగా ముస్లింలందరూ భక్తిశ్రద్ధలతో చేసుకునే బక్రీద్ అని.. అల్లాహ్ ఆశీస్సులు ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉండాలని కోరారు..
Kannappa : హీరో విష్ణు మంచు తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ నుంచి ప్రతీ వారం ఒక అప్డేట్ ఇవ్వడానికి చేసిన ప్రకటనకు అనుగుణంగా, ప్రతీ సోమవారం కొత్త సమాచారం అందిస్తున్నారు. సినిమా నుంచి వివిధ పాత్రలను పోషించిన ప్రముఖ నటీనటుల పోస్టర్‌లను విడుదల చేసి ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగిస్తున్నారు. ఈసారి, ‘కన్నప్ప’ సినిమా ప్రమోషన్లను మరింత సరికొత్తగా, యానిమేటెడ్ కామిక్ బుక్స్ రూపంలో చేసింది. డిసెంబర్ 23న, ‘కన్నప్ప యానిమేటెడ్ కామిక్ బుక్-1’ పేరుతో ఓ…