James Anderson Reacts to Sharing Trophy Name with Sachin Tendulkar: ఇంగ్లీష్ గడ్డపై ఇంగ్లండ్-భారత్ టెస్టు సిరీస్ విజేతకు ఇచ్చే ట్రోఫీకి ‘పటౌడీ సిరీస్’ అనే పేరు ఉండేది. ఇటీవలే పటౌడీ పేరును ఇంగ్లండ్ బోర్డు రిటైర్ చేసి.. ‘అండర్సన్-టెండూల్కర్’ ట్రోఫీగా మార్చింది. భారత్‌లో తలపడితే ‘ఆంథోని డి మెల్లో’ ట్రోఫీని ఇచ్చేవారు. ఇక భారత్‌లో ఆడినా, ఇంగ్లండ్‌లో తలపడినా.. రెండు జట్ల మధ్య సిరీస్ విజేతకు అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ ఇవ్వనున్నారు. విజేత జట్టు…
క్రికెట్లో ఎప్పుడూ రికార్డులు క్రియేట్ అవుతూనే ఉంటాయి. అలాగే ఉన్న రికార్డులు బద్దలవుతూనే ఉంటాయి. అయితే టెస్ట్ క్రికెట్లో మాత్రం కాస్త భిన్నం. ఇక్కడ రికార్డులు బద్దలుకొట్టాలనుంటే.. అతను ‘ది బెస్ట్ ప్లేయర్’ అయ్యుండాలి. అలాంటి ప్లేయరే జో రూట్. అంతేకాదు ఇప్పడు టెస్ట్ క్రికెట్లో ఉన్న గోట్ ప్లేయర్ కూడా. టెస్టుల్లో విరాట్ కోహ్లీ రిటైర్ కావడంతో ప్రస్తుతం ఫ్యాబ్ ఫోర్లో రూట్, స్టీవ్ స్మిత్ , కేన్ విలియమ్సన్ మాత్రమే ఉన్నారు. రూట్ ఆడిన…
Anderson–Tendulkar Trophy: ఇండియా-ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ మ్యాచ్ లకు ప్రతిష్టాత్మక గుర్తింపుగా “ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ” గా నామకరణం చేసిన సంగతి తెలిసిందే. ఈ టెస్ట్ సంబంధించిన ట్రోఫీను తాజాగా ఆండర్సన్, టెండూల్కర్ లు ఆవిష్కరించారు. ఈ ట్రోఫీ 2007 నుంచి 2024 వరకు ఉన్న పటౌడి ట్రోఫీకి ప్రత్యామ్నాయంగా ఉండనుంది. ఈ కొత్త ట్రోఫీలో టెండూల్కర్‌కు చెందిన క్లాసిక్ కవర్ డ్రైవ్, అలాగే అండర్సన్‌కు చెందిన ప్రత్యేకమైన బౌలింగ్ యాక్షన్ ఉన్న చిత్రాలను పొందుపరిచారు. వీరిద్దరి సంతకాలు…
సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఐపీఎల్ టైటిల్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) విజయోత్సవాల వేళ పెను విషాదం చోటుచేసుకుంది. బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియం వద్ద తమ ఆరాధ్య క్రికెటర్లను చూసేందుకు పెద్దఎత్తున అభిమానులు రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందారు. మరో 50 మందికి పైగా తీవ్రంగా గాయపడగా.. అందులో కొందరి పరిస్థితి విషంగా ఉంది. ఈ ఘటనపై ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. క్రికెట్ దిగ్గజం…
Suryakumar Yadav: ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. పంజాబ్ కింగ్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో 57 పరుగులు చేసిన సూర్య, ముంబై ఇండియన్స్ తరఫున ఒక సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఈ సీజన్ లో ఇప్పటివరకు అతను చేసిన పరుగులు 628 కాగా.. ఇందులో భాగంగానే, సచిన్ టెండూల్కర్ 2010లో నెలకొల్పిన 618 పరుగుల రికార్డును అధిగమించాడు. Read Also:…
ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్‌కు ముంబై ఇండియన్స్ దూసుకెళ్లిన విషయం తెలిసిందే. లీగ్ ఆరంభంలో వరుస పరాజయాలతో పట్టికలో అట్టడుగున నిలిచిన ముంబై.. ఆపై వరుస విషయాలతో లీగ్ దశలో మరో మ్యాచ్ ఉండగానే ప్లేఆఫ్స్ బెర్త్ దక్కించుకుంది. ఇక టాప్ 2 స్థానం కోసం పోటీ పడుతోంది. ఓ దశలో లీగ్ స్టేజ్ నుంచే ఇంటిదారి పట్టేలా కనిపించిన ముంబై.. అనూహ్యంగా రేసులోకి రావడానికి కారణం స్టార్ బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన…
Sachin Tendulkar: టీమిండియా మాజీ కెప్టెన్ లలో ఒకరైన విరాట్ కోహ్లీ టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సందర్భంగా భారత క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ఓ భావోద్వేగంతో కూడిన కథను సోషల్ మీడియా వేదికా గుర్తు చేసుకున్నారు. తన టెస్టు రిటైర్మెంట్ సందర్భంగా కోహ్లీ ఇచ్చిన ఒక విలువైన గిఫ్ట్ ప్రతిపాదనను గుర్తు చేసుకుంటూ, కోహ్లీకి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలిపారు. Read Also: Bangladesh: షేక్ హసీనాకు బిగ్ షాక్.. యూనస్ ప్రభుత్వం అవామి లీగ్…
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ప్రస్తుతం ఐపీఎల్ 2025లో ఆడుతున్నాడు. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతున్న మహీ.. కీపర్, బ్యాటర్‌గా సేవలందిస్తున్నాడు. తన సహచర ప్లేయర్స్ సురేష్ రైనా, యువరాజ్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, ఆశిష్ నెహ్రా, జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్ లాంటి వారు ఇప్పటికే ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించగా.. 43 ఏళ్ల ధోనీ ఇంకా కొనసాగుతున్నాడు. అయితే తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ధోనీ.. తనకు ఎదురైన…
మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో బిల్‌గేట్స్ భారత్‌లో పర్యటిస్తున్నారు. ఇటీవల పార్లమెంట్ భవన్‌ను సందర్శించారు. అనంతరం ఏపీ ప్రభుత్వంతో పలు కీలక ఒప్పందాలు చేసుకున్నారు. తాజాగా సచిన్ టెండూల్కర్‌తో ఉన్న ఒక వీడియోను బిల్‌గేట్స్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.
మార్చి 18 అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో ఒక ప్రత్యేకమైన రోజు. టీమిండియాకు ఈరోజు చాలా చిరస్మరణీయమైనది. మార్చి 18.. ముగ్గురు దిగ్గజ క్రికెటర్లు తమ చివరి వన్డే మ్యాచ్ ఆడారు. వారిలో క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్, శ్రీలంక మాజీ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ కుమార్ సంగక్కర, మాజీ కెప్టెన్ మహేల జయవర్ధనే ఉన్నారు.