వేసవి సెలవుల మజా ముగింపు దశకు చేరుకుంది. నెలన్నర విరామం తర్వాత బడిగంటలు ఇవాళ్టి నుంచి మోగనున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం 41 వేల స్కూళ్లు, గురుకులాలు, వసతిగృహాలు తిరిగి తెరుచుకోనున్నాయి. దీంతో దాదాపు 60 లక్షల మంది స్టూడెంట్స్ తిరిగి బడిబాటపట్టనున్నారు.
TS EAMCET Results 2023: తెలంగాణలో ఎంసెట్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. మాసబ్‌ట్యాంక్‌లోని జేఎన్‌ఏఎఫ్‌ఏయూ ఆడిటోరియంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి వి.కరుణ, కళాశాల, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య ఆర్.లింబాద్రి, జేఎన్‌టీయూ-హైదరాబాద్ వీసీ ప్రొఫెసర్ కట్టా నరసింహారెడ్డి తదితరులు ఫలితాలను విడుదల చేశారు.
Telangana EAMCET: తెలంగాణలో ఎంసెట్ ఫలితాల ప్రకటనకు సమయం ఆసన్నమైంది. ఎంసెట్ ఫలితాలను మే 25న గురువారం ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు ఎంసెట్ కన్వీనర్ తెలిపారు.
రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
పదో తరగతి ప్రశ్న పత్రాల లీకేజీ పై విద్యాశాఖ మంత్రి సభితా ఇంద్రారెడ్డి స్పందించారు. పదవ తరగతి పరీక్షల విషయంలో జిల్లా కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు పాఠశాల యాజమాన్యాలు, పోలీసు విభాగం, పోస్టల్ డిపార్ట్ మెంట్, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, ఆర్టీసీ అధికారులు సమన్వయంతో పనిచేయాలని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నానని ట్విట్టర్ వేదికగా తెలిపారు.