ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ రైల్వేస్టేషన్‌కు సమీపంలో సబర్మతి ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. భారీ బండరాయిని రైలు ఇంజిన్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక దర్యాప్తు సూచిస్తోంది. అదృష్టవశాత్తు ఈ రైలు ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
గోద్రా అల్లర్ల కేసుకు సంబంధించిన సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. 2002లో గుజరాత్‌లోని గోద్రాలో సబర్మతి ఎక్స్‌ప్రెస్‌కు నిప్పు పెట్టిన 8 మంది దోషులకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. జీవిత ఖైదు అనుభవిస్తున్న వ్యక్తులకు కోర్టు నుండి ఉపశమనం లభించింది. ఈ దోషులందరికీ 17 నుంచి 20 ఏళ్ల జైలు శిక్ష పడింది.