ప్రతి ఏడాది శబరమల యాత్రను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. శబరిమల యాత్రకు లక్షలాది మంది భక్తులు శబరిమల వెళ్తుంటారు. అయితే, కరోనా కారణంగా గతేడాది ఈ యాత్రను పరిమిత సంఖ్యకే పరిమితం చేశారు. కాగా, ఈ ఏడాది నవంబర్ 16 నుంచి తిరిగి శబరిమల యాత్ర ప్రారంభం అవుతుంది. ఈ నేపథ్యంలో కేరళ ప్రభుత్వం మార్గదర్శాకలు రిలీజ్ చేసింది. రోజుకు 25 వేల మంది భక్తులు అయ్యప్పను దర్శనం చేసుకునేందుకు వీటుగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.…