మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు కొరటాల శివ కాంబోలో వస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఆచార్య’. తాజాగా ఈ చిత్రం నుంచి ‘శానా కష్టం’ అనే స్పెషల్ సాంగ్ ప్రోమోను విడుదల చేశారు మేకర్స్. “శానా కష్టం వచ్చిందే మందాకిని…చూసేవాళ్ల కళ్లు కాకులెత్తుకు పోనీ” అనే సాహిత్యంతో మొదలయ్యే ఈ పాట వింటుంటే ఉత్సాహంగా ఉంది. ఈ పెప్పీ నంబర్‌లో చిరు, రెజీనా కసాండ్రా కలిసి స్టెప్పులేశారు. ఎప్పటిలాగే చిరు డాన్స్‌లో తన గ్రేస్, ఈజీని మెయింటెన్ చేస్తున్నాడు.…