Pakistan: ఇటీవల పాకిస్తాన్ వ్యాప్తంగా ఇజ్రాయిల్ వ్యతిరేక నిరసనలు మిన్నంటాయి. ఇజ్రాయిల్-హమాస్ మధ్య ‘‘గాజా శాంతి ఒప్పందం’’ జరుగుతున్న సమయంలోనే పాకిస్తాన్ లో ఇస్లామిస్ట్ అతివాద సంస్థ తెహ్రీక్-ఎ-లబ్బాయిక్ పాకిస్తాన్ (TLP) నిరసనల్లో తీవ్ర హింస చోటు చేసుకుంది. ముఖ్యంగా లాహోర్ నగరం రక్తసిక్తంమైంది.