(సెప్టెంబర్ 29న యన్టీఆర్ ‘అడుగుజాడలు’కు 55 ఏళ్ళు) నటరత్న యన్టీఆర్, నటచక్రవర్తి యస్వీఆర్ డాక్టర్లుగా నటించిన చిత్రం ‘అడుగుజాడలు’. తాపీ చాణక్య దర్శకత్వంలో నవజ్యోతి ఫిలిమ్స్ పతాకంపై ఎమ్.సాంబశివరావు, జి.వందనం ‘అడుగుజాడలు’ నిర్మించారు. ఈ చిత్రంలో జమున నాయికగా నటించారు. 1966 సెప్టెంబర్ 29న ఈ సినిమా విడులయింది. ‘అడుగుజాడలు’ కథ విషయానికి వస్తే- డాక్టర్ కృష్ణ ఎంతో మేధావి. తన వైద్యంతోనూ, మంచితనంతోనూ దుర్మార్గులను సైతం సన్మార్గంలో నడిపిస్తూ ఉంటారు. పోలియోకు అప్పట్లో తగిన వైద్యం…
(సెప్టెంబర్ 8న కలసివుంటే కలదు సుఖంకు 60 ఏళ్ళు పూర్తి) ఆ రోజుల్లో నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ ఓ కుటుంబంలా ఉండేవారు. నిర్మాతను తల్లిగా, దర్శకుడిని తండ్రిగా భావించేవారు. హీరో పెద్దకొడుకుగా బాధ్యతలు స్వీకరించేవారు. ఇలాంటి నీతినియమాలు అన్నవి సినిమా పుట్టిన దగ్గర నుంచీ అంతటా ఉన్నవే. అవి మన దేశంలోనూ సినిమా రంగం స్వర్ణయుగం చవిచూసిన రోజుల్లో పరిఢవిల్లాయి. ఆ నాటి మేటి నటులు ఇవే నియమాలను తు.చ.తప్పక పాటించేవారు. మహానటుడు యన్.టి.రామారావు మరింతగా…