ఇప్పటి వరకు సెన్సార్ కట్ పడకుండా సంసారపక్షంగా చిత్రాలు తెరకెక్కిస్తూ సాగుతున్నారు దర్శకుడు ఎస్.వి. కృష్ణారెడ్డి. ఈ మధ్యే ఆయన ‘ఆర్గానిక్ మామ.. .హైబ్రీడ్ అల్లుడు…’ అనే సినిమాకు శ్రీకారం చుట్టారు. ఎస్వీ కృష్ణారెడ్డి చిత్రాలలో మానవసంబంధాలు, వాటి విలువలకు పీట వేస్తూనే తసదైన పంథాలో వినోదాన్ని చొప్పించేవారు. అందువల్లే ఎస్వీకే సినిమాను చూడటానికి అప్పట్లో ఆబాలగోపాలం పరుగులు తీసేవారు. పాతికేళ్ళ క్రితం ఆయన దర్శకత్వంలో రూపొందిన ‘ఆహ్వానం’ కూడా జనాన్ని అలాగే అలరించింది. 1997 మే…
దర్శకుడు, సంగీత దర్శకుడు ఎస్.వి.కృష్ణారెడ్డి భలేగా సక్సెస్ రూటులో సాగుతున్న సమయంలో తెరకెక్కించిన చిత్రం ‘మావిచిగురు’. అప్పటికే ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో జగపతిబాబు ‘శుభలగ్నం’ వంటి బంపర్ హిట్ మూవీలో నటించి ఉండడంతో, ‘మావిచిగురు’ ఆరంభం నుంచీ ఓ ప్రత్యేకమైన క్రేజ్ నెలకొల్పింది. అందుకు తగ్గట్టుగానే మహిళాలోకాన్ని ఆకట్టుకొనే కథాంశంతో రూపొందిన ‘మావిచిగురు’ కూడా విజయకేతనం ఎగురవేసింది. 1996 మే 30న విడుదలైన ‘మావిచిగురు’ ప్రేక్షకులను భలేగా మెప్పించింది. భర్తంటే ప్రాణం పెట్టే కథానాయిక, తాను ఎక్కువ…