S-500 Prometheus: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ 4-5 తేదీల్లో భారత్‌లో పర్యటించబోతున్నారు. ఈ పర్యటనలో భారత్, రష్యాల మధ్య రక్షణ, ఇంధనం రంగాల్లో కీలక ఒప్పందాలు కుదిరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, రష్యా తయారీ S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌తో పాటు అధునాతన S-500 ప్రోమేతియస్ క్షిపణి వ్యవస్థ