S-500 Prometheus: S-400 మాత్రమే కాదు, S-500 కోసం చర్చలు.. పుతిన్ పర్యటనలో కీలక ఒప్పందం.!
- భారత పర్యటకు వస్తున్న పుతిన్..
- రష్యా, భారత్ మధ్య భారీ రక్షణ ఒప్పందాలు..
- ఎస్400 తో పాటు ఎస్ -500 వ్యవస్థలపై చర్చలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
S-500 Prometheus: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ 4-5 తేదీల్లో భారత్‌లో పర్యటించబోతున్నారు. ఈ పర్యటనలో భారత్, రష్యాల మధ్య రక్షణ, ఇంధనం రంగాల్లో కీలక ఒప్పందాలు కుదిరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, రష్యా తయారీ S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌తో పాటు అధునాతన S-500 ప్రోమేతియస్ క్షిపణి వ్యవస్థ కూడా చర్చల్లో ఉంటుందని తెలుస్తోంది. 2018లో 5.43 బిలియన్ డాలర్లతో భారత్ ఐదు S-400 యూనిట్లను కొనుగోలు చేసింది. ఈ అత్యాధునిక రక్షణ వ్యవస్థ ఆపరేషన్ సిందూర్ సమయంలో తన ప్రతాపాన్ని చూపించింది. వందల దూరంలో, పాకిస్తాన్ నుంచి దాడికి వస్తున్న క్షిపణులను, యుద్ధ విమానాలను కూల్చేసింది. ప్రస్తుతం, భారత్ మరిన్ని యూనిట్ల S-400లను కోరుతోంది.
ఇదిలా ఉంటే, పుతిన్ పర్యటనలో S-400 కొనుగోలుతో పాటు దీనికి అడ్వాన్డుడ్ వ్యవస్థ అయిన S-500 ప్రోమేతియస్‌పై కూడా ఒప్పందాలు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇది కేవలం S-400కు అప్‌గ్రేడ్ వెర్షన్ మాత్రమే కాకుండా దీని సామర్థ్యాలు, ఉన్నతమైన ఆయుధ వ్యవస్థగా ఉంది. ఇంతకుముందులా, S-400లను రష్యా నుంచి కొనుగోలు చేసినట్లు కాకుండా, S-500 ఉత్పత్తిలో భారత్ కూడా పాలుపంచుకోవాలని భావిస్తోంది. భారత భాగస్వామిగా రష్యాకు చెందిన అల్మాజ్ ఆంటే కంపెనీతో కలసి ఈ క్షిపణి వ్యవస్థను స్థానికంగా తయారు చేసే అవకాశం ఉంది. S-400 భారతదేశ వైమానికి ఆధిపత్యానికి సాక్ష్యంగా ఉంది. ఇప్పుడు S-500 వస్తే భారత వాయు, క్షిపణి నిరోధక వ్యవస్థ మరింత శత్రు దుర్భేధ్యంగా మారుతుంది. అంతరిక్ష ఆధిపత్యాన్ని కూడా అందిస్తుంది.
Also Read
- Mamata Banerjee: మమతా బెనర్జీకి బిగ్ షాక్.. నందిగ్రామ్ పోటీ నుంచి అభ్యర్థి విత్‌డ్రా..
- Suvendu Adhikari: మమతకు ‘‘శ్రీరాముడి శాపం’’.. బెంగాల్ సీఎం ఫైర్..
- TMC Crisis: టీఎంసీకి కొత్త పేర్లు, గుర్తులు.. మమతకు ‘‘ఫుట్‌బాల్ ప్లేయర్’’, రిటబ్రతకు ‘‘ఎన్వలప్ కవర్’’..
- Gurugram: వామ్మో ఇదేం జాడ్యం.. హిట్ అండ్ రన్ కేసులో నిందితుడికి మద్దతుగా కార్ల ర్యాలీ
Read Also: PMO Rename: మోడీ సర్కార్ కీలక నిర్ణయం.. ప్రధాని కార్యాలయం పేరు మార్పు..
వీటి మధ్య తేడాలు ఇవే:
* S-400 400 కి.మీ వరకు పరిధిని కలిగి ఉంటుంది, అయితే S-500 దాదాపు 500-600 కి.మీ వరకు విస్తరించి ఉంటుంది.
* S-400 30 కి.మీ ఎత్తు వరకు లక్ష్యాలను అడ్డుకుంటుంది, అయితే S-500 180-200 కి.మీ వరకు లక్ష్యాలను అడ్డుకుంటుంది.
* S-400 విమానం, డ్రోన్‌లు, క్రూయిజ్ క్షిపణులను ఎదుర్కొంటుంది, అయితే S-500 వాటన్నింటితో పాటుగా దీర్ఘ-శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను ఎదుర్కొంటుంది, హైపర్‌సోనిక్ గ్లైడ్ వెహికిల్స్‌ను అడ్డుకుంటుంది. S-400 థియేటర్ ఎయిర్ డిఫెన్స్‌కు మద్దతు ఇస్తుండగా, S-500 జాతీయ స్థాయి ఎయిర్, బాలిస్టిక్, హైపర్‌సోనిక్ డిఫెన్స్‌కు మద్దతు ఇస్తుంది.
* ఈ రెండింటిలో క్షిపణులు భిన్నంగా ఉంటాయి. S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ 48N6, 40N6 క్షిపణులను ఉపయోగిస్తుంది. S-500 వ్యవస్థ 77N6-N, 77N6-N1 హిట్-టు-కిల్ ఇంటర్‌సెప్టర్‌లను కలిగి ఉంటుంది.
* S-400 శత్రు దేశాల నుంచి వచ్చే వైమానిక ముప్పులను అడ్డుకుంటుంది. ఒక ప్రాంతాన్ని రక్షిస్తుంది. S-500 వ్యవస్థ నగరాలను, కీలకమై జాతీయ ఆస్తుల్ని కూడా రక్షిస్తుంది.
తాజావార్తలు
-
UPI Payments: పెట్రోల్ బంకుల్లో యూపీఐ పేమెంట్స్ బంద్..? డీలర్ల అసోసియేషన్ కీలక నిర్ణయం..
-
Mamata Banerjee: మమతా బెనర్జీకి బిగ్ షాక్.. నందిగ్రామ్ పోటీ నుంచి అభ్యర్థి విత్‌డ్రా..
-
Danam Nagender : దానం నాగేందర్‌పై అనర్హత వేటు.. స్పీకర్ నిర్ణయాన్ని పక్కనపెట్టిన హైకోర్టు
-
Nani: నా సినిమాలకు ఆ ట్యాగ్ వద్దు.. కుండబద్దలు కొట్టిన న్యాచురల్ స్టార్!
-
Uttam Kumar Reddy : తెలంగాణలో నీటి కొరత.. రైతులకు ఉత్తమ్ కీలక హామీ
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..