S-400: పాకిస్తాన్, చైనా దేశాలకు చేదు వార్త. భారత్ రక్షణ దళాలు రష్యాకు బయలుదేరాయి. ఎందుకంటే, ప్రపంచంలోనే అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌లో ఒకటైన S-400 వైమానిక రక్షణ వ్యవస్థలపై అధునాతన శిక్షణ తీసుకోవడానికి మన సైనికులు పెద్ద సంఖ్యలో రష్యాకు వెళ్లారు.
Operation Sindoor: పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్ పాకిస్తాన్‌పై ‘‘ఆపరేషన్ సిందూర్’’ నిర్వహించింది. కేవలం నాలుగు రోజుల్లోనే పాక్ కాళ్ల బేరానికి వచ్చేలా చేసింది. అయితే, ఈ ఆపరేషన్ గురించిన వివరాలు ఒక్కొక్కటిగా ప్రస్తుతం బయటకు వస్తున్నాయి. భారత్ చెప్పినదాని కన్నా దాడి తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నట్లు పాకిస్తాన్ పత్రాలు చెబుతున్నాయి. ఆపరేషన్ సిందూర్ విజయం సాధించి ఒక నెల గడవడంతో నేషనల్ సెక్యూరిటీ ప్లానర్స్, మిలిటరీ అధిపతులు శనివారం సాయంత్రం వేడుకలు చేసుకున్నారు.
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ ఈ రోజు పంజాబ్ అదంపూర్ వైమానిక స్థావరాన్ని సందర్శించారు. అక్కడ ఉన్న ఎయిర్ ఫోర్స్ సిబ్బందిని అభినందించారు. పాకిస్తాన్‌పై ‘‘ఆపరేషన్ సిందూర్’’ సమయంలో ఈ బేస్ కీలకంగా వ్యవహరించింది. అయితే, భారత ప్రధాని ఒక్క చర్యతో పాకిస్తాన్, చైనాలు చెబుతున్నవి అబద్ధాలని రుజువు చేశారు.