రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో మరణాల లెక్కలు ఊహకు అందడం లేదు. అంతేలేకుండా సాగుతున్న ఈ సమరంలో, ఇప్పటి వరకు దాదాపు 10వేలమంది రష్యన్ సైనికులు చనిపోయారని తాజాగా వెల్లడించింది రష్యన్ ప్రభుత్వ అనుకూల మీడియా సంస్థ కొమ్సో. అయితే ఏమైందో ఏమోగాని వెంటనే ఆ కథనాన్ని తొలగించింది. అయితే, అప్పటికే ఆ వివరాలు ప్రపంచమంతా పాకిపోయాయి. రష్యా రక్షణ శాఖ గణాంకాలను కోట్ చేస్తూ, కొమ్సో మీడియా చెప్పిన దాని ప్రకారం, 9,861 మంది రష్యన్ సైనికులు చనిపోయారు.…