రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం భీకర స్థాయికి చేరేలా కనిపిస్తోంది. వరుసగా మూడోరోజు కూడా ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంపై బాంబుల దాడి సాగుతోంది. రష్యా సైనికుల బాంబు దాడుల నుంచి ప్రాణాలతో బయటపడేందుకు కీవ్ నగరంలో స్థానికులు అండర్‌గ్రౌండ్ మెట్రో స్టేషన్లో తలదాచుకుంటున్నారు. ఆ మెట్రో స్టేషన్లే ఇప్పుడు బాంబు షెల్టర్లు. అక్కడ తలదాచుకుంటున్న ఓ గర్భిణి ప్రసవించింది. బేబీకి జన్మనిచ్చిన విషయాన్ని కొందరు సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాగా మెట్రో స్టేషన్లనే బంకర్లుగా…
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది.. రాజధాని కీవ్‌ను పూర్తిస్థాయిలో ఆధీనంలోకి తీసుకునేలా ముందుకు కదులుతున్నాయి రష్యా బలగాలు.. ఇప్పటికే కీవ్ ఎయిర్‌పోర్ట్‌ను స్వాధీనం చేసుకుంది రష్యా.. మరోవైపు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసరంగా సమావేశం అయ్యింది… రష్యాకు వ్యతిరేకంగా భద్రతా మండలిలో ఓటింగ్ కూడా నిర్వహించారు.. అయితే, ఓటింగ్‌కు మాత్రం భారత్, చైనా దూరంగా ఉన్నాయి.. భద్రతా మండలి 15 సభ్యదేశాల్లో 11 దేశాలు రష్యాకు వ్యతిరేఖంగా ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ఖండిస్తూ ఓటు వేయగా.. భద్రతా…
ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న దురాగతాలు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఉక్రెయిన్‌లో జరుగుతున్న ప్రస్తుత సంఘటనల గురించి, అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాల గురించి సోషల్ మీడియాలోనూ తీవ్రంగా చర్చ నడుస్తోంది. ఇప్పుడు సమంత, కాజల్ అగర్వాల్ వంటి సౌత్ సెలబ్రిటీలు కూడా ఈ విషయంపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ విషయంపై సమంతా ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్టును షేర్ చేసింది. Read Also : RC15 video leaked : షూటింగ్ లో చెర్రీ…
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం మూడో రోజుకు చేరుకుంది.. ఇప్పటికే పలు కీలక ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి రష్యా బలగాలు.. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు సమీపంలోని కీలకమైన విమానాశ్రయాన్ని కూడా హస్తగతం చేసుకున్నట్లు రష్యా సైన్యం ప్రకటించింది. దీంతో పశ్చిమ దేశాలతో కీవ్‌కు ఉన్న సంబంధాలు తెగిపోయేలా చేసింది రష్యా.. అతిపెద్ద రన్‌వేతో కూడిన ఈ ఎయిర్‌పోర్ట్‌కు భారీ రవాణా విమానాలు వచ్చే అవకాశం ఉండడంతో.. కీవ్శివారులోని తమ బలగాల్ని తరలించాలన్నా.. రప్పించాలన్నా రష్యాకు మరింత సులువు…
ఉక్రెయిన్ సైన్యం ఆయుధాలు వీడితే చర్చలకు సిద్ధం అని రష్యా ప్రకటించిన సంగతి తెలిసిందే. రష్యా ఈ ప్రకటన చేసిన వెంటనే, తాము కూడా సిద్ధంగా ఉన్నామని ఉక్రెయిన్ ప్రకటించింది. అయితే, రష్యాపై యూరోపియన్ యూనియన్ ఆంక్షలు విధించడం, రష్యా ఆస్తులను స్థంభింపజేయడం, సైబర్ దాడులు చేయడం వంటివి చేస్తుండటంతో పుతిన్ యూటర్న్ తీసుకున్నారు. ఎవరు చెప్పినా వినొద్దని, ఉక్రెయిన్ మొత్తాన్ని ఆక్రమించాలని ఆదేశాలు జారీ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. రష్యా అధ్యక్షుడి నుంచి ఈ విధమైన…
రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం భయాందోళనలు కలిగిస్తున్నది. ఉక్రెయిన్‌లోకి ప్రవేశించిన రష్యా దళాలు వేగంగా కీవ్‌ను ఆక్రమించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఉక్రెయిన్ సైన్యం ప్రతిఘటిస్తున్నా అది ఎంతసేపు అన్నది ఎవరూ చెప్పలేరు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో తాలిబన్లు చేసిన కీలక వ్యాఖ్యలు ఇప్పుడు హైలెట్ అవుతున్నాయి. యుద్ధం విషయంలో రెండు దేశాలు సంయమనం పాటించాలని, హింసాత్మక ఘటనలకు పాల్పడటం ద్వారా ఎలాంటి ఉపయోగం ఉండబోదని తాలిబన్లు హెచ్చరించారు. సమస్యలను రెండు దేశాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని…
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెస్కీ రాజకీయ జీవితాన్ని ఆరంభించే ముందు ఆయన ఏం చేశారు అనే విషయాలు ఇప్పుడు హైలెట్‌గా మారాయి. సోషల్ మీడియాలో జెలెస్కీ గురించి నెటిజన్లు సెర్చ్ చేస్తున్నారు. జెలెస్కీ కి సంబంధించిన చాలా విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. జెలెస్కీ రాజకీయాల్లోకి రాకముందు ఆయన ఓ కమెడియన్‌గా జీవితాన్ని ప్రారంభించారు. ఆయన నటించిన ఓ టీవీ సీరియల్ అప్పట్లో బాగా పాపులర్ అయింది. పెద్ద ఎత్తున అభిమానులను సంపాదించిపెట్టింది. ఆ ప్రజాభిమానాన్ని జెలెస్కీ రాజకీయంగా…
ఉక్రెయిన్ లో పరిస్థితులు దిగజారుతున్నాయి. రష్యన్ దళాలు ఉక్రెయిన్‌లో దాడులు చేస్తున్న నేపథ్యంలో భారతీయ విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఉక్రెయిన్‌లో పెద్ద సంఖ్యలో భారతీయ విద్యార్థులు మెడిసిన్ తో పాటు వివిధ కోర్సులను అభ్యసిస్తున్న సంగతి తెలిసిందే. సడెన్‌గా యుద్ధం రావడంతో యూనివర్శిటీల నుంచి విద్యార్థులను బయటకు పంపించేశారు. భారతీయ విద్యార్థులను సొంత దేశానికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. Read: CM Jagan : ఏపీ ఆర్ధిక అభివృద్ధిలో విశాఖ నగరం కీలకపాత్ర పోషిస్తోంది ఉక్రెయిన్ గగనతలాన్ని…
ఉక్రెయిన్, రష్యా మధ్య నెలకొన్ని యుద్ధ పరిస్థితులతో అక్కడ చిక్కుకునన భారతీయ పౌరులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఉక్రెయిన్ ఎంబీసీతో పాటు.. సంబంధింత అధికారులతో మాట్లాడుతూ.. భారతపౌరులను దేశానికి తీసుకువచ్చేందుకు ఇండియన్ ఎంబసీ తీవ్రంగా శ్రమిస్తోంది. అయితే ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతపౌరులు ఉక్రెయిన్ సరిహద్దు దాటి పోలెండ్ కు చేరుకుంటే అక్కడి నుంచి ఢిల్లీకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలెండ్ రాజధాని భారత రాయబార కార్యాలయం భారత్ పౌరులు, విద్యార్థులకు…