PM Modi-Putin telephonic call: ప్రధాని నరేంద్రమోడీ ఈ రోజు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో టెలిఫోన్‌లో మాట్లాడారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ఇటీవల జరిగిన ఉక్రెయిన్ పర్యటనపై ఇరు నేతలు చర్చించారు.
ప్రధాని నరేంద్ర మోడీ ఉక్రెయిన్లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. 'యుద్ధానికి దూరంగా ఉండడమే భారత్ ఎంచుకున్న రెండో మార్గం అని అన్నారు. తాము యుద్ధానికి దూరంగా ఉన్నాము.. భారత్ మొదటి రోజు నుండి పక్షపాతం కలిగి ఉంది. మా వైపు శాంతి ఉంది, మేము యావత్ ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించిన మహాత్మా గాంధీ భూమి నుండి మేము వచ్చాము.' అని ఉక్రెయిన్…
ప్రధాని నరేంద్ర మోడీ ఉక్రెయిన్లో పర్యటిస్తున్నారు. పోలాండ్ నుంచి నేరుగా రైలులో శుక్రవారం ఉదయం కీవ్ చేరుకున్నారు. కీవ్‌కు చేరుకున్న ఆయనకు భారతీయ కమ్యూనిటీ ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు.
ఉక్రెయిన్ ఎదురుదాడికి రష్యా వణికిపోయింది. గత ఎనిమిది నెలల్లో పుతిన్ బలగాలు ఉక్రెయిన్‌లో స్వాధీనం చేసుకున్నంత రష్యా భూమిని చిన్న దాడితో ఎనిమిది రోజుల్లో ఉక్రెయిన్ స్వాధీనం చేసుకుంది. రష్యా అధ్యక్షుడు ఉక్రెయిన్ దాడితో ఆగ్రహానికి గురయ్యాడు. శత్రువులను తరిమికొట్టడానికి కుర్స్క్‌కు మరిన్ని దళాలను మోహరించాలని క్రెమ్లిన్‌కు పిలుపునిచ్చారు.
PM Modi Ukraine Visit: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత తొలిసారిగా ప్రధాని నరేంద్రమోడీ ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇటీవల మోడీ రష్యాలో పర్యటించారు.
Donald Trump: ఉక్రెయిన్‌కి మద్దతు ఇవ్వడాన్ని ప్రస్తావిస్తూ, రష్యా డొనాల్డ్ ట్రంప్ హత్యాయత్నాన్ని ఖండించింది. ద్వేషాన్ని రెచ్చగొట్టే విధానాలను అంచనా వేయాలని అమెరికాకు పిలుపునిచ్చింది.
PM Modi : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా భారత సైన్యానికి చెందిన అనేక రక్షణ పరికరాలు మరమ్మతులకు నోచుకోవడం లేదు. అయితే ఇప్పుడు దీనికి పరిష్కారం దొరుకుతుందని తెలుస్తోంది.
Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఒకప్పటి తన పర్సనల్ బాడీగార్డు అయిన అలెక్సీ డ్యూమిన్‌కి అత్యున్నత పదవి కట్టబెట్టారు. 51 ఏళ్ల డ్యూమిన్‌ని స్టేట్ కౌన్సిల్ సెక్రటరీగా పుతిన్ నియమించారు.
రష్యాపై దాడి చేసేందుకు తమ క్షిపణులను ఉక్రెయిన్‌కు ఇవ్వవద్దని.. ఇస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పాశ్చాత్య దేశాలను హెచ్చరించారు. ఐరోపాలోని నాటో సభ్యులు ఉక్రెయిన్‌కు పాశ్చాత్య ఆయుధాలను ప్రయోగించమని ఆఫర్ చేయడం ద్వారా నిప్పుతో ఆడుకుంటున్నారు అని మండిపడ్డారు.
రష్యా ఆక్రమిత ప్రాంతాలపై తొలిసారిగా ఉక్రెయిన్ సుదూర బాలిస్టిక్ క్షిపణితో దాడి చేసింది. బుధవారం నాడు అర్థరాత్రి రష్యా ఆర్మీ ఎయిర్‌స్ట్రిప్, క్రిమియాలోని మరికొన్ని ప్రాంతాలపై జరిగాయని పేర్కొన్నాయి.