Russia: ఉక్రెయిన్ యుద్ధంలో ఉపయోగించేందుకు రష్యా తన ఆయుధ తయారీని పెంచింది. ముఖ్యంగా హైపర్ సోనిక్ క్షిపణుల తయారీని పెంచాలని ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ ఆదేశించారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసిన ఒక రోజు తర్వాత రష్యా అధినేత పుతిన్ శుక్రవారం మాట్లాడుతూ.. మాస్కో హైపర్‌సోనిక్ ఒరెష్నిక్ బాలిస్టిక్ క్షిపణిని పోరాట పరిస్థితుల్లో మరిన్ని పరీక్షలు నిర్వహిస్తుందని చెప్పారు.
ఉక్రెయిన్‌లో రష్యా దాడి మొదలై 25 రోజులు దాటింది. సైనిక చర్య అనేది ఇప్పుడు అది పూర్తి స్థాయి యుద్ధాన్ని తలపిస్తోంది. చర్చలు ఓ కొలిక్కి వచ్చే సూచనలు కనిపించటం లేదు. మరోవైపు రష్యా బలగాలు ఉక్రెయిన్ నగరాలలో విధ్వంసం సృష్టిస్తోంది. దేశంలో రెండో ప్రధాన నగరం మారియుపోల్ సర్వనాశనం అయింది. ఎక్కడ చూసినా యుద్ధం తాలూకు ధ్వంసమే. ప్రస్తుతం ఈ నగరం రష్యా దళాల స్వాధీనంలో ఉన్నట్టు తెలుస్తోంది. అటు పుతిన్ బలగాలు రాజధాని కీవ్‌కు…