గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు వ్యాఖ్యలపై వైసీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సీరియస్ అయ్యారు. రుషికొండ రిసార్ట్స్ ను మెంటల్ హాస్పిటల్ చేయాలన్న వ్యాఖ్యలపై బొత్స ఫైర్ అయ్యారు. అశోక్ వ్యాఖ్యలు అహంకారం, అహంభావానికి నిదర్శనం అని మండిపడ్డారు. అశోక్ గజపతిరాజు వ్యాఖ్యలు ఆయన మానసిక స్థితికి నిదర్శనం అని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఎటువంటి వారికి గవర్నర్ పదవి ఇచ్చిందో అర్థం చేసుకోవచ్చు అని బొత్స సత్యనారాయణ ఎద్దేవా చేశారు. ప్రజాధనంతో నిర్మించిన…